ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే రహదారులు మనుషులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ సమయంలోనే ప్రజలు బయటకు వస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను ఆపి వాహనదారులను కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
చీరాలలో ప్రశాంతంగా లాక్డౌన్
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అనవసరంగా బయటకు వస్తున్న వారిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
చీరాలలో ప్రశాంతంగా లాక్డౌన్