ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టర్, ఎస్పీ రావాలి.. కుమ్మర్లకుంట వివాదంపై వివరణ ఇవ్వాలి: జాతీయ బీసీ కమిషన్ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

జాతీయ బీసీ కమిషన్ నుంచి ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిలుపొచ్చింది. ప్రకాశం జిల్లాలో కె. బిట్రగుంట కుమ్మర్లకుంట వివాదంపై చర్చించేందుకు రావాలని తెలిపింది.

జాతీయ బీసీ కమిషన్ నుంచి కలెక్టర్, ఎస్పీలకు పిలుపు
జాతీయ బీసీ కమిషన్ నుంచి కలెక్టర్, ఎస్పీలకు పిలుపు

By

Published : Jul 12, 2021, 4:03 PM IST

ప్రకాశం జిల్లా జురుగుమల్లి మండలం కె.బిట్రగుంట కుమ్మర్లకుంట వివాదంలో చర్చించేందుకు జాతీయ బీసీ కమిషన్ నుంచి ప్రకాశం కలెక్టర్, ఎస్పీ లకు పిలుపొచ్చింది. గ్రామంలో జాతీయ రహదారిపై ఆనుకుని ఉన్న 6.9 ఎకరాల స్థలంలో కుమ్మర్లు... కుండల తయారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. 1971లో అప్పటి కలెక్టర్ ఈ స్థలాన్ని వారి సంఘానికి అప్పగించారు. నాటి నుంచి సొసైటీ ఏర్పాటు చేసుకొని కుమ్మరి ఉత్పత్తులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ యూనిట్లు నిర్వహిస్తున్న షెడ్లను ప్రొక్లెయినర్లతో తొలగించారు. దీని వెనుక వైకాపా నాయకులు హస్తం ఉందని విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కుమ్మరి సంఘ ప్రతినిధులు, బాధితులు జాతీయ బీసీ కమిషన్​కు ఫిర్యాదు చేసారు. దీనిపై.. బీసీ కమిషన్ స్పందించి ఈ వ్యవహారం చర్చించేందుకు ఈ నెల 13న న్యూదిల్లీలో ఉన్న జాతీయ బీసీ కమిషన్ కార్యాలయానికి హాజరు కావల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీ పేర్ల మీద నోటీసు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details