ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 బస్తాల నల్ల బెల్లం స్వాధీనం - ఉయ్యాలవాడలో నాటుసారా తయారీ

నాటుసారా వినియోగానికి ఉపయోగించే నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా చింతలపల్లె నుంచి ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

black jaggery seized by excise police at uyyalavada prakasam district
నల్లబెల్లం తరలిస్తున్న ఆటో స్వాధీనం

By

Published : Apr 19, 2020, 4:54 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ వద్ద నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చింతలపల్లె నుంచి బెల్లాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 10 బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details