ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తదానంపై చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర - west bengal youngman bicycle trip news

యువతలో రక్తదానంపై చైతన్యం కల్పించేందుకు పశ్చిమబంగాకు చెందిన ఓ యువకుడు సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నాడు. యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా మీదుగా వెళ్తుండగా... ఒంగోలు రెడ్ క్రాస్‌ సభ్యులు యువకుడిని అభినందించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-December-2019/5521576_cycle.mp4
రక్తదానంపై చైతన్యం కల్పించేందుంకు సైకిల్ యాత్ర

By

Published : Dec 29, 2019, 12:01 AM IST

యువతలో రక్తదానంపై చైతన్యం కల్పించేందుకు పశ్చిమబంగాకు చెందిన ఓ యువకుడు సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నాడు. హుగ్లీకి చెందిన జ్యూట్‌ మిల్లు కార్మికుడు జయదేవ్‌ రావ్‌ అనే యువకుడు పశ్చిమ బంగ నుంచి కన్యాకుమారికి వెళ్లాడు. అక్కడనుంచి తిరిగి బెంగుళూరు, తెలంగాణా మీదుగా సొంత రాష్ట్రానికి సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం దాదాపు 9వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాడు. యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా మీదుగా వెళ్తూ... ఒంగోలులో కొద్దిసేపు ఆగారు. అక్కడ స్థానికంగా ఉన్న రెడ్ క్రాస్‌ సభ్యులు జయదేవ్​ రావ్​ను కలిసి అభినందించారు. 'ఫెడరేషన్​ ఆఫ్‌ బ్లడ్‌ డొనర్స్‌ ఆఫ్‌ ఇండియా' ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి సహకారంతో ఈ యాత్ర సాగిస్తున్నట్లు జయదేవ్‌ తెలిపాడు. రక్తదానం ఆవశ్యకత, యువతకు రక్తదానం పట్ల చైతన్యం కల్పించేందుకే ఈ సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించాడు.

రక్తదానంపై చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర

ABOUT THE AUTHOR

...view details