రక్త దానానికి ఆ చిన్నారులే స్పూర్తి ప్రధాతలుగా నిలిచారు. వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు రక్త దానం చేయించారు. ప్రకాశం జిల్లా పేర్నమెట్ట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల్లో జరిగిన చాలా రోజుల క్రితం రక్తదాన శిబిరం.. ఈ దిశగా పలువురిలో స్పూర్తి నింపింది. సాధారణంగా పెద్దలే రక్తదానం ఇస్తుంటారు. కొంత వయసు వచ్చిన తర్వాతే రక్తం దానం చేయొచ్చని వైద్యులూ చెబుతుంటారు. హైస్కూల్ స్థాయి పిల్లలకు రక్తదానానికి వయసు సరిపోదు. ఈ విద్యార్థులు రక్తాన్ని ఇవ్వలేకపోయినా.. వారి ద్వారా స్పూర్తి పొందిన వారు.. దానానికి వస్తారనే ఉద్దేశ్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఓ కార్యక్రమం చేపట్టింది.
పేర్నమెట్ట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ఈ విషయంపై చర్చించి విద్యార్థులకు రక్తదాన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ విద్యార్థులు వారి తల్లిదండ్రులను, బంధువులను ఒప్పించారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఇప్పటికే చాలా మంది రక్తదానం చేస్తున్నారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో రక్తదానంపై అవగాహన ఉండదు. పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు, రైతు కూలీలు నివసించే ప్రాంతంలో ఇలా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి, రక్తదాతలు ముందుకు రావడం హర్షణీయమని జూనియర్ రెడ్ క్రాస్ సొసైటి సభ్యులు, ఉపాధ్యాయలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో ఈ చైతన్యం ఎంతోమందికి స్పూర్తినిస్తుందని... రక్తం కొరత తీర్చి, ఎంతో మంది ప్రాణాలను నిలుపుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: