ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బలిజెపల్లిలో భూ సమస్య ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఘటనలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. బండి బాలసుబ్బమ్మ, బాలమ్మ, బాల కోటయ్య, గోపిశెట్టి శ్రీనులకు తీవ్రంగా దెబ్బలు తగలటంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మండలంలోని కంభంపాడు ఇలాకాలోని సర్వే నెంబర్ 240/2ఏ లో ఉన్న 0.97 ఎకరా పంట భూమి దగ్గర వివాదం జరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గట్టు తగాదాలో నలుగురికి గాయాలు - భూ వివాదం
0.97 ఎకరా పంట పొలం దగ్గర ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ మోదలైంది. వివాదం ముదిరి చివరకు కొట్టుకుని గాయాలపాలయ్యేంత వరకు వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
భూ వివాదం..నలుగురుకి తీవ్ర గాయాలు