ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలులో బేస్​బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక - ongole

ఆంధ్రప్రదేశ్ బేస్​బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికను ఒంగోలులో నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

బేస్ బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

By

Published : Aug 26, 2019, 8:19 AM IST

ఒంగోలులో బేస్​బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రైవేట్ హోటల్లో బేస్ బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి అధ్యక్షలు, కార్యదర్శులతో పాటు శాప్ ప్రతినిధి హాజరయ్యారు. బేస్ బాల్ అసోసియేషన్ సభ్యుల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర బేస్​బాల్ అసోసియేషన్ చైర్మన్​గా సంతనూతలపాడు ఎమ్మెల్యే టి జె సుధాకర్ బాబు ఎన్నికవగా... రాష్ట్ర అధ్యక్షుడిగా పశ్చిమగోదావరికి చెందిన మారుతీ రావు, సంఘ కార్యదర్శిగా ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు సుబ్బారావు ఎన్నికయ్యారు. బేస్​బాల్ క్రీడకు రాష్ట్రంలో ఖ్యాతి తీసుకొస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. క్రీడాకారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కావలసిన సదుపాయాలు ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details