వృద్ధులకు అండ 'ఆసరా' ప్రథమ వార్షికోత్సవం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మారెళ్ళగుంటపాలెంలో సరోజ్ సేవా ఫౌండేషన్, ఆసరా పేరుతో స్థాపించిన వృద్ధాశ్రమం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
1960 నుండి ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో చదివిన విద్యార్థులు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పటి ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ సంస్థను స్థాపించి ఉన్నత భావాలతో స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్నత భావాలతో... వృద్ధులందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో 'ఆసరా' పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
మూడున్నర కోట్ల వ్యయంతో ముప్పై ఐదు గదుల ఈ భవనాన్ని అన్ని వసతులతో వృద్ధులకు అవసరమైన రీతిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శుద్ధ జల కేంద్రం, జిమ్, సుందరమైన పార్కులు, గ్రంధాలయం, రీడింగ్ రూమ్, టీవీ హాల్, నాణ్యమైన భోజనాలతో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్నత భావాలతోనే జీవించామని నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. పేదవారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మా సంస్థ యొక్క లక్ష్యంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి, సినీ గేయ రచయిత గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రజా నాట్యమండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పలువురు పలువురు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం శ్రీనివాస్ పలు గేయాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. గీత అకాడమీ వారి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యం ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. వృద్ధాశ్రమం నడపడానికి దానం చేసిన నలుగురిని ఘనంగా సన్మానించారు.