ప్రకాశం జిల్లా కనిగిరిలో పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై కనిగిరి ఏడీఏ తనిఖీలు నిర్వహించారు. కనిగిరి సబ్ డివిజన్లో రైతు భరోసా కేంద్రాలలో సక్రమంగా యూరియా పంపిణీ కాకపోవడం వల్ల...ఇదే అదునుగా ప్రైవేటు ఎరువుల దుకాణాల యజమానులు అధిక మొత్తంలో ఎరువులను నిల్వచేసి, అన్నదాతలకు అధిక ధరలకు విక్రయిస్తుండడంపై ఈనాడు పత్రికలో "యూరియా...అందడం లేదయా"అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారులు కనిగిరి పట్టణంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలలో ఉన్న నిల్వలను, స్టాకు రిజిస్టర్, లైసెన్సులను తనిఖీచేశారు.
ఈనాడు కథనానికి స్పందన... ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ప్రకాశం జిల్లా కనిగిరిలో పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో అధిక ధరకు యూరియా విక్రయిస్తున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు.. కనిగిరిలో దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఒక యూరియా బస్తా ధర రూ.266.50పైసలు మాత్రమేనని, అంతకుమించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణ లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీలలో భాగంగా కనిగిరి వ్యవసాయ సంచాలకులు(ఏడీఏ) వెంకటరమణ మాట్లాడుతూ...కనిగిరి సబ్ డివిజన్లోని ఆరు మండలాలలో సుమారు 17 వేల హెక్టారుల విస్తీర్ణంలో ఖరీఫ్ సీజన్ పంటలు సాగు అయ్యాయన్నారు. ఒక యూరియా సంచి రూ. 266.50 పైసలు మాత్రమే అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ధరకు అమ్మినవారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని ఏడీఏ హెచ్చరించారు.
ఇదీ చదవండి :మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్