ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య..? - కుటుంబ కలహాలతో ఉరివేసుకుని వ్యక్తి మృతి

బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చాడు ఓ యువకుడు. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు.

a young presondied with hanging because of his family quarrel at prakasham district
కుటంబ కలహాలు..మనస్తాపంతో యువకుడు మృతి..?

By

Published : Dec 10, 2019, 10:03 AM IST

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య..?

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామంలో వేప చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... తమిళనాడులోని కానూరుకు చెందిన బాలగురు గోపీనాథ్(37) అనే వ్యక్తి ఒంగోలు గోపాల్​నగర్​లో నివాసముంటున్నారు. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో... మనస్తాపానికి గురైన గోపీనాథ్ తక్కెళ్లపాడు వద్ద ఉన్న పొలాల్లోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్​కు తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details