ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైటీసీ కేంద్రం... గిరిజనులకు వరం - nellur

గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు నింపాలని సర్కారు భావించింది. నిరుద్యోగ యవతకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను నెలకొల్పింది. రాష్ట్రంలో 22 కేంద్రాల్లో తర్ఫీదు కొనసాగుతోంది. రెండు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం సైతం వైటీసీనే కల్పిస్తోంది.

వైటీసీ కేంద్రం... గిరిజనులకు వరం

By

Published : May 22, 2019, 8:02 AM IST

వైటీసీ కేంద్రం... గిరిజనులకు వరం

నిరుద్యోగ గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలని ప్రభుత్వం యోచించింది. ఐటీడీఏ, వైటీసీల అధ్వర్యంలో ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు 22 వరకూ నెలకొల్పింది. వాటిలో సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఉచిత భోజన, వసతితోపాటు విశాలమైన ప్రాంగణంలో వివిధ నైపుణ్యాభివృద్ధి అంశాలపై శిక్షణ కొనసాగుతోంది.

శిక్షణతోపాటు ఉద్యోగం...
వైటీసీ కేంద్రాల్లో కంప్యూటర్ శిక్షణతోపాటు డీఎస్సీ కోచింగ్, సెల్​ఫోన్, మోటార్ల మరమ్మతు, మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణతో సరిపెట్టకుండా వారికి ఉద్యోగ అవకాశాలు సైతం కల్పిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు ఈ కేంద్రాలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

నిపుణులైన బోధకులు...
నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన ఉద్యోగులు ఉన్నారు. రెండు నెలలు అనేక రంగాలపై శిక్షణ ఇవ్వడానికి కంపెనీల నుంచి కూడా నిపుణులు వస్తున్నారు. తడ వద్ద శ్రీ సిటీ, చైన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల సమన్వయంతో వైటీసీ కేంద్రం పని చేస్తోంది.

వెంకటాచలంలో 747 మందికి శిక్షణ...
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 2015లో యువ కేంద్రం ఏర్పాటు చేశారు. మూడేళ్లలో 747మందికి శిక్షణ ఇచ్చారు. 525 మందికి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించారు. పదో తరగతి చదివిన వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించారు. ఇక్కడ 5 కోట్ల రూపాయలతో ప్రత్యేక భవనం నిర్మించారంటే... ప్రభుత్వం వైటీసీ కేంద్రాలపై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో... ఇట్టే అర్థమవుతోంది.

కార్పొరేట్ కంపెనీల్లో రిక్రూట్​మెంట్​కు తొలి అడుగు వైటీసీ వైపే పడుతోంది. గిరిజన యువత మాత్రం వీటిని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమవుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details