YCP MLA Anil Kumar Yadav voter identity controversy: మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముడు చోట్ల ఓటరుగా నమోదు అయినట్లు.. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ ల్లో 111, 182, 191లో ఓటు హక్కు ఉంది. మూడు చోట్ల ఉన్న ఓటు యూనిక్ నెంబర్లు ఏహెచ్ యూ 0911628, ఏహెచ్ యూ 2984136, ఏహెచ్ యూ2937753 గా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ ఇవి ఉండగా , బీల్ వోలు వాటిని సవరించకుండానే ఆలానే ఉంచారు. గతంలో 107, 177, 185 పోలింగ్ బూత్ లు గా ఉన్నాయి. ఇప్పుడు అవి 111, 182, 191గా మారాయి... నెల్లూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఓటర్ల ముసాయిదాపై ప్రత్యేక శిబిరాలు ప్రహసనంగా మారాయి.
మొక్కుబడిగా ఓటరు జాబితా సవరణ - భారీగా అవకతవకలు, బీఎల్వోల తీరుపై ఓటర్ల అసహనం
బీఎల్వోల నిర్లక్ష్యం: నెల్లూరు నగరంలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 11గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో లేరు. కొన్ని చోట్ల మధ్యాహ్నం తరువాత కనిపించలేదు. జిల్లాలో మొత్తం 228పోలింగ్ కేంద్రాలను పరిశీలించగా , దాదాపు 108 కేంద్రాల్లో ఉదయం 10.30గంటలు దాటినా బీఎల్వోలు రాలేదు. మధ్యాహ్నం గంటల తరువాత 153 కేంద్రాల్లో మాత్రమే బీఎల్వోలు కనిపించారు. వారిలో చాలా మంది సాయంత్రం 4గంటలకే వెళ్లిపోయారు. దుత్తలూరులోని పోలింగ్ బూత్ నంబర్ 108లో మొత్తం 913ఓట్లు ఉండగా వాటిలో350 ఓట్ల ఇంటి చిరునామా (0) జీరోసంఖ్యతో ఉన్నాయి.