వెంకటగిరి అభివృద్ధిని కాంక్షిస్తూ తాము వైకాపాలో చేరుతున్నట్టు రాజవంశస్థులు సాయికృష్ణ యాచేంద్ర తెలిపారు. వెంకటగిరి వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి.. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
వైకాపాలో చేరికలు
By
Published : Mar 19, 2019, 9:59 PM IST
వైకాపాలో చేరికలు
నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ వంశీకులు తెదేపాను వీడి వైకాపాలో చేరారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో... తమరాజభవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడేపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, సోదరుడు సర్వజ్ఞ యాచేంద్ర వైకాపాలో చేరిన వారిలో ఉన్నారు.మూడున్నర దశాబ్దాలుగా తెదేపాలో తాము కొనసాగామని.. వెంకటగిరి అభివృద్ధి కోసమే పార్టీ మారామనీ చెప్పారు.