Protest At APGENCO Gate In Nellore : నెల్లూరు జిల్లా ముత్తుకూరు ఏపీ జెన్కో గేటు వద్ద శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మానవహారం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ జెన్కోను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర కేబినెట్ తీర్మానించి జనవరి 21నాటికి ఏడాది పూర్తికానున్న సందర్భంగా '365 రోజుల పోరాట సభ' ను ఏర్పాటు చేశారు.
"365 రోజుల పోరాట సభ".. ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల భారీ నిరసన - 365 రోజుల పోరాట సభ
Protest At APGENCO Gate In Nellore: శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణకు కార్మికులు భారీ నిరసన చేపట్టారు. ముత్తుకూరు ఏపీ జెన్కో గేటు వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Protest At APGENCO Gate In Nellore
ప్రైవేటీకరణను నిరసిస్తూ సంవత్సరం నుంచి ఏపీ జెన్కో, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఏపీ జెన్కో ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, సీపీఎం, జనసేన పార్టీలు తమ మద్దతుని తెలియజేశాయి.
ఇవీ చదవండి: