నెల్లూరులోని మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త అశోక్ వేధింపులు భరించలేకే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, నాలుగో నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణం!
నెల్లూరు జిల్లాలో నాగలక్ష్మి అనే మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపులే కారణమని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..భర్త వేధింపులే కారణం!