శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ మద్యం దుకాణం వద్ద మందుబాబులు బారులు తీరారు. కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో మందు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. ప్రభుత్వ నిబంధనలతో గొడుగులు తీసుకుని వచ్చారు.
గొడుగుతో మద్యం కోసం ఎదురుచూస్తూ..! - మేనకూరులో తెరుచుకున్న మద్యం దుకాణాలు తాజా వార్తలు
పైన ఎండ మండిపోతోంది. కొంతమందికి కాళ్లకు చెప్పులు కూడా లేవు. అయినా సరే గంటల తరబడి నిలబడ్డారు. గొడుగులు, మాస్కులు తెచ్చుకున్నారు. భౌతిక దూరం పాటించారు. ఇదంతా మద్యం కోసమే.
గొడుగుతో మద్యం కోసం ఎదురుచూస్తూ....
ఇక్కడకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి భారీగా మద్యం ప్రియులు వస్తున్నారు. అక్కడ రెడ్ జోన్ ఉన్నందున ఇక్కడికి చేరుతున్నారు. పోలీసులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి.. రాష్ట్ర సరిహద్దులో గొయ్యి తవ్విన తమిళ అధికారులు
TAGGED:
wine shops open at menakuru