కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరగనుంది. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలు నెల్లూరు నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 730 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతి పొందారు. పలువురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.
21న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం - జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు
విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవాలను ఈ నెల 21న నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.
జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు ప్రారంభం
TAGGED:
vsu convocation date fixed