నెల్లూరు పట్టణంలో పలు ఉల్లి దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కృత్రిమ కొరతను సృష్టించి ఉల్లిని అధిక ధరకు అమ్ముతున్నారనే అనుమానంతోనే దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన అధికారులు... స్టోన్హౌస్పేటలో ఉన్న పలు ఉల్లి హోల్సేల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. నిల్వకు, రికార్డులకు తేడా ఉండడాన్ని గుర్తించిన అధికారులు... వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఉల్లి నిల్వచేసి... అధిక ధరకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు.
ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
నెల్లూరు పట్టణంలోని ఉల్లి అక్రమ నిల్వ చేసిన కేంద్రాలపై... విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ దాడులు