ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి" - విక్రమసింహపురి యూనివర్శిటిలో వెంకయ్యనాయుడు తాజా వార్తలు

మాతృభాషను మర్చిపోకూడదని.. అమ్మభాషను కాపాడుకోవాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఏ ప్రభుత్వం వచ్చినా మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

venkayya naidu speech on telugu language in vikramapuri university celebrations in nellore
"ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి"

By

Published : Jan 21, 2020, 4:50 PM IST

"ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి"

కన్న తల్లిని, మాతృభూమిని, మాతృభాషను మరచిపోకూడదని.. ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాల్సిన భాషాభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను మర్చిపోకూడదన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మైసూరులో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలించిందని తెలిపారు. తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, అందరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details