శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెంబడిపాలెం గ్రామమంతా పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉండగా వివిధ గ్రామాల్లో భూములను లీజుకు తీసుకొని 1500 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు. గ్రామంలో పండించిన కూరగాయలను గూడూరు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తూ వ్యాపారం చేస్తుంటారు.
లాక్డౌన్తో రైతులకు కూర 'గాయాలు' - nelloore district chenbadipalem news
ఆ పల్లెలో అడుగుపెడితే రకరకాల కూరగాయల సాగు దర్శనమిస్తాయి. ఊరంతా కలసి కూలీల ప్రమేయం లేకుండా ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటు కురగాయలు సాగుచేసుకుంటుంటారు. 50 సంవత్సరాలుగా కూరగాయల సాగులో ప్రత్యేక ప్రతిభ చూపుతూ కరువు కాటకాలలో సైతం అనుకూల పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జించేవారు. కరోన రాక వారి తలరాతలను మార్చేసింది. లాక్డౌన్ సమయంలో ఎగుమతులు లేక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు దిగాలు చెందుతున్నారు. ఇంతకీ అసలు విషయం తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లా చెంబడిపాలెనికి వెళ్లాల్సిందే...
ఎగుమతులు లేక కూరగాయల రైతుల ఆందోళన
కరోనా కారణంగా లాక్డౌన్లో ఎగుమతులు లేక రేట్లు పడిపోయి రైతులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన అన్నదాతలు వరి సాగు కంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే కూరగాయల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారి వలన గత మూడు నెలలుగా రైతులకు ఎలాంటి ఆదాయం లేదని ప్రభుత్వం వారు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..