రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల(జూన్ 3 నుంచి 5 వరకు) పాటు పునశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ విభాగం నెల్లూరు జిల్లా అధికారి లక్ష్మీ మాధవి తెలిపారు. గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తోన్న వాలంటీర్ల (ఐసీఆర్పీ) తో వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. నెల్లూరులోని వందన హోటల్లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాదిగా జిల్లాలో జరిగిన ప్రకృతి వ్యవసాయం, సేద్యంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి అనే వాటిపై శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
''ప్రకృతి వ్యవసాయ వృద్ధే మా లక్ష్యం'' - ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే దిశగా.. క్షేత్రస్థాయిలో పనిచేస్తోన్న ఐసీఆర్పీలకు నెల్లూరులో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారు.
జిల్లాలో ప్రకృతి వ్యవసాయ వృద్ధే లక్ష్యం