నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన అతిచిన్న రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో ఎస్ఎస్ఎల్వీ (Small Satellite Launch Vehicle) రాకెట్‌కు భూస్థిర పరీక్ష నిర్వహించారు. భారత అంతరిక్ష వాణిజ్య రంగంలో ఇస్రో చౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేస్తోంది.
చిన్న ఉప గ్రహాలను చిన్న రాకెట్లతో ఉపయోస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఇస్రో ఎస్ఎస్ఎల్వీకి రూపకల్పన చేసింది. 500 కిలోల బరువు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేలా దీన్ని తయారు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీలో పది శాతం ఖర్చుతో మూడు ఘన ఇంధన మోటర్లతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించారు.