నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రమణయ్య అనే వ్యక్తి ఈనెల 7న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాంతో బంధువులు ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర వైద్యానికి చేర్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తకు ఫోన్ చేసి విషయాన్ని తెలపటంతో ఆయన అక్కడకు చేరుకొని వారి పరిస్థితి తెలుసుకున్నారు. అప్పటికే బాధితుల నుంచి ఆసుపత్రి సిబ్బంది కొంత మొత్తాన్ని వసూలు చేశారు. ఈ విషయాన్ని సమన్వయకర్తకు బాధితులు తెలపగా.. వారికి ఆ డబ్బులను చెక్కు రూపంలో ఇప్పించారు. ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్
కరోనా నేపథ్యంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒక వేళ పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా అక్కడ కేవలం అత్యవసర వైద్యసేవలు మాత్రమే అందిస్తున్నారు. సాధారణ రోగులను తిరిగి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెలీ మెడిసిన్ పేరుతో టోల్ ఫ్రీ నంబర్‌ను 14410ను కేటాయించారు. ప్రజలు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వైద్యుడి ద్వారా సలహాలు, సూచనలు అందుతాయి. ఇప్పటికే ఆన్‌లైన్ వైద్యసేవలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఫోన్లో సలహాలు, సూచనలు
రాష్ట్రంలో ఈనెల 13న టెలీ మెడిసిన్‌ను ప్రారంభించారు. అయితే నెల్లూరు జిల్లాలో ఈనెల 15వ తేదీన ఇందుకు అవసరమైన వైద్యుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించి సేవలు కొనసాగిస్తున్నారు. రోజుకు 150 ఫోన్ కాల్స్ వస్తుండగా.. వారందరికీ మందులు, తదితర వైద్య సూచనలు అందిస్తున్నారు. ఒకవేళ ప్రమాదకర పరిస్థితులు ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. కొవిడ్-19 లక్షణాలు అని అనుమానిస్తే సంబంధిత వ్యక్తుల వైద్యులను వారి వద్దకు పంపి ఆరోగ్య లక్షణాల మేరకు అవసరమైతే క్వారంటైన్ కేంద్రాలను తరలిస్తున్నారు.
ఇలా చేయాలి..