నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురవేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వటంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల జాబితా పరిశీలనకు అచ్చెన్న నగరానికి వచ్చారు.
54 డివిజన్లలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.