నెల్లూరు జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే పెన్నానది పొర్లుకట్టలను అక్రమార్కులు పగలగొడుతున్నారు. ప్రభుత్వ అనుమతుల పేరు చెప్పి నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత పేరుతో భూగర్భగనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలకు స్వస్థి చెబుతున్నారు. ఒకటిన్నర మీటరు లోతు మాత్రమే ఇసుకను తవ్వాల్సి ఉండగా.. అక్రమార్కులు మాత్రం పదిమీటర్లుపైగా తవ్వేస్తున్నారు. పెన్నానదిలో ఇసుక అక్రమాలపై మరికొన్ని విషయాలను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు.
SAND MAFIA: పెన్నాను తవ్వేస్తున్న ఇసుకాసురులు.. నిబంధనలకు తూట్లు
పెన్నానదిలోని ఇసుకపై కన్నేసిన అక్రమార్కులు యదేచ్ఛగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు కూడా దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.
పెన్నాను తవ్వేస్తున్న ఇసుకాసురులు