Road accident In Kothur Two Youths Died:నెల్లూరు నగరం కొత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న సిటీ బస్సు, మోటార్ సైకిల్ వేగంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు సైకిల్ పై వస్తున్న ముగ్గురు యువకుల్లో విష్ణువర్ధన్, ఖాసిం అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేష్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలపాలైన వెంకటేష్ ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి - సిటీ బస్సు మోటార్ సైకిల్ యాక్సిడెంట్
Road accident In Kothur Two Youths Died:నెల్లూరు నగరం కొత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న సిటీ బస్సు, మోటార్ సైకిల్ వేగంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
కొత్తూరులో రోడ్డు ప్రమాదం