నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్, పవర్ ప్రాజెక్టులను నడిపించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పరిశ్రమల శాఖ ఇన్ఛార్జీ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. రెడ్జోన్ల పరిధిలో ఉన్న పరిశ్రమలకు నిబంధనలు సరళతరం అయ్యాయని చెప్పారు. నూతన ఉత్తర్వుల ప్రకారం కంటైన్మెంట్ జోన్కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశ్రమలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని వివరించారు.
నిబంధనలు సరళతరం... తెరచుకోనున్న పరిశ్రమలు
నెల్లూరు జిల్లాలో ఉన్న పరిశ్రమలు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని... పరిశ్రమల శాఖ ఇన్చార్జీ జేడీ ప్రసాద్ తెలిపారు. వీటి పనితీరు ఆగిపోతే ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సర్కారు నిబంధనలను సడలించిందని తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న పరిశ్రమల శాఖ ఇన్చార్జీ డైరెక్టర్