Rape Attempt: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని సైదాపురం సమీపంలో విదేశీ వనితపై అత్యాచారయత్నం జరిగింది. లూథియానా దేశానికి చెందిన బాధితురాలు భారత్‌లో విహార యాత్రకు వచ్చారు. ఈ నెల 7న చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కారు. ఐతే..ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించాడు. ఈనేపథ్యంలో అదే బస్సులో ఉన్న మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళేనికి చెందిన సాయి కుమార్.. ఆ టికెట్‌కు డబ్బు చెల్లించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
Rape attempt: నెల్లూరులో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారయత్నం
15:27 March 08
విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితులు అరెస్టు
నమ్మించి స్వగ్రామం తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన అతను.. స్నేహితుడు షేక్ అబిద్తో కలిసి ఆమెపై అత్యాచారానికి యత్నించగా తప్పించుకున్న బాధితురాలు.. స్థానికుల సాయంతో సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్ని చిల్లకూరు జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: చంద్రబాబు
విదేశీ యువతిపై అత్యాచారయత్నం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటన రాష్ట్రానికే కాక, దేశానికీ తలవంపులు తీసుకువస్తుందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Police manhandling on youngster: ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. చితకబాదారు..!