నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు జరిమానా విధించారు పోలీసులు. బస్సు నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న డ్రైవర్‌ను గమనించిన పోలీసులు రూ. 2,000 జరిమానా విధించారు. మెుదటి తప్పుగా భావిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి.. జరిమానా విధించినట్లు ఆత్మకూరు ఎస్ఐ శివశంకర్ రావు తెలిపారు. వాహన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు షాక్
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. వాహనదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నిత్యం జరిమానాలు విధించడంతో పాటు.. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం లాంటి చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే పోలీసులు మమ్మల్ని ఏం చేయరనే భావనతో ఆర్టీసీ డ్రైవర్లు రయ్‌మంటూ సిగ్నళ్లు జంప్ చేయడమే కాకుండా.. రాష్‌గా డ్రైవింగ్ చేస్తుంటారు. అయితే పోలీసులు ఆర్టీసీ డ్రైవర్లకు స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి అవగాహన కల్పించినా తీరు మారడం లేదు. దీంతో పటిష్ఠమైన చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు రూ. 2వేలు జరిమానా
Last Updated : Sep 11, 2021, 8:43 PM IST