'ఒంటరిగానే వస్తున్నాం'
మోదీ సభలను అడ్డుకోకుండా తమను అడ్డుకోవడం ఏంటని...ఇంతజరుగుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఎవరితోనూ పొత్తు ఉండదనినెల్లూరులో వెల్లడించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ అమలు చేస్తామన్న రాహుల్ గాంధీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్రను వెంకటగిరిలో అడ్డుకున్న వైకాపాపై ఆయన ధ్వజమెత్తారు.మోదీసభలను అడ్డుకోకుండా తమను అడ్డుకోవడం ఏంటని...ఇంతజరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు 1300 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర పూర్తైన తర్వాత వాటిని పరిశీలిస్తామన్నారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో రాహుల్ గాంధీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని వెల్లడించారు.