రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు పశ్చిమ్‌బంగ నుంచి రాష్ట్రానికి బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కృష్ణపట్నం చేరుకుంది. రెండు కంటైనర్లలో 40 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకువచ్చిన ఈ రైలు... 27 గంటల్లో గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఈ రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని వివరించారు. ఈ నెలాఖరులో 76.39 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నాలుగు కంటైనర్ ట్యాంకర్లతో గుంటూరుకు చేరుకుంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా పశ్చిమ్‌బంగ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్... కృష్ణపట్నం చేరుకుంది. 27 గంటల్లోనే ఈ రైలు గమ్యస్థానానికి చేరినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్