ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 23, 2020, 6:25 PM IST

ETV Bharat / state

వృద్ధురాలి ఆకలి చూపు.. యువకుల సహాయం..

లాక్​డౌన్ కారణంగా ఎందరో అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. దాతలు అందించిన సహాయంతో ఓ పూట కడుపు నింపుకుంటున్నా వారి అవస్థలు వర్ణనాతీతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ వృద్ధురాలు ఆహారం కోసం దీనంగా చూస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.

old woman waiting for food in atmakuru
వృద్ధురాలి ఆకలి చూపు

లాక్​డౌన్​ కారణంగా అభాగ్యులు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రమీల అనే వృద్ధురాలు ఆకలితో దీనంగా ఎదురు చూసిన తీరు కలిచివేసింది. ఈమెకు నా అనేవారు లేరు. చాలా ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చింది. లాక్​డౌన్ నేపథ్యంలో తిండి దొరక్క ఇబ్బందులు పడుతుంది. చివరకు కొందరు యువకులు ఆహారం అందించటంతో కడుపు నింపుకుంది.

ABOUT THE AUTHOR

...view details