నెల్లూరు జిల్లా గూడూరు పురపాలక సంఘం పరిధిలోనిగాంధీనగర్‌లో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఇళ్ల సముదాయాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 5వేల307ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది.ఇంటి నిర్మాణాలు పూర్తైనా ఇంకా అక్కడ మౌలిక సౌకర్యాలైన విద్యుత్,తాగునీటి సరఫరా అందించలేదు. ఈ పనులు పూర్తి కాకుండానే సార్వత్రిక ఎన్నికలు రావటంతో అవి అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చాయి.రైల్వే గేట్ల పక్కన స్థలాల్లో పూరిగుడిసెల్లో నివసించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
సొంతింటి కోసం.. పేదల ఎదురుచూపులు - PUBLIC
నామమాత్రపు సొమ్ము కడితే సొంతింటి కల నెరవేరుతుందని వారంతా ఎంతో ఆశపడ్డారు. షీర్ వాల్ సాంకేతికతతో కడుతున్న ఇళ్లను చూసి మురిసిపోయారు. అయితే గృహ సముదాయాల నిర్మాణం పూర్తి చేయకపోవటంతో ఆ పేదలందరూ అద్దె కట్టుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. తమ చేతికి ఇంటి తాళాలు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూస్తున్నారు.
ntr house
లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకపోవటంతో ఆరు నెలలుగా అవి బూజుపట్టి.. చెత్తా చెదారంతో నిండిపోయాయి.కండలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేయాల్సి ఉందని గుత్తేదారు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తమ సొంతింటి కల నెరవేర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.