ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కూలీలకు కరవైన రక్షణ - ఉపాధి కూలీలకు లేని రక్షణ

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కనీస రక్షణ సూత్రాలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తుతున్నాయి. అయితే అక్కడ ఇవేమీ పట్టడంలేదు. మాస్కులు, శానిటైజర్లు వంటివేమీ లేకుండానే ఉపాధి కూలీల చేత పని చేయిస్తున్నారు అధికారులు.

no masks and sanitizers to employment wages at dakkili nellore district
ఉపాధి కూలీలకు కరవైన రక్షణ

By

Published : Apr 15, 2020, 6:20 PM IST

కరోనా దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. భౌతిక దూరం పాటించడం, మాస్కుల వినియోగం, శానిటైజర్లు ఉపయోగించాలని నిత్యం అవగాహన కల్పిస్తున్నా నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో మాత్రం ఆ దిశగా చర్యలు కనిపించట్లేదు. మండలంలో సుమారు 800 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. వారి రక్షణకు అధికారులు కనీస చర్యలు చేపట్టకుండానే పనులు చేయిస్తున్నారు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ పనులు చేయాల్సి వచ్చిందని కూలీలు వాపోయారు. ఈ విషయమై ఎంపీడీవో వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని.. ఎలాంటి కరోనా వైరస్‌ రక్షణ పరికరాలు తమకు అందలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details