ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం - Nellore Corporation

నెల్లూరు నగరపాలక సంస్థ చివరి సమావేశం ముగిసింది. జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన అనిల్​కుమార్ యాదవ్, గౌతంరెడ్డికి కౌన్సిల్ అభినందనలు తెలిపింది.

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం

By

Published : Jun 28, 2019, 9:07 PM IST

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం

నెల్లూరు నగరపాలక సంస్థ చివరి సమావేశం రసాభాసగా సాగింది. వచ్చేనెల కౌన్సిల్ గడువు పూర్తి కానుండటంతో... కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వానికి మేయర్ అజీజ్ అభినందనలు తెలిపారు. జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన అనిల్​కుమార్ యాదవ్, గౌతంరెడ్డికి అభినందనలు తెలిపారు. కౌన్సిల్​లో చర్చ జరుగుతున్న సందర్భంగా... నెక్లెస్ రోడ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని వైకాపా సభ్యులు ఆరోపించారు. తెదేపా సభ్యులు వారి వ్యాఖ్యలను ఖండించడంతో... వాగ్వివాదం జరిగింది. వైకాపా కార్పొరేటర్ నూనె మల్లికార్జునయాదవ్, తెదేపా కో ఆప్షన్ సభ్యుడు ఓం ప్రకాష్​యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో... సభలో గందరగోళం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details