శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యశాలలో ఎక్స్రే సౌకర్యం అందుబాటులో లేని విషయంపై, మందుల కొరతపై.. వైద్యులతో, జిల్లా వైద్యశాలల సమన్వయకర్త సుబ్బారావుతో ఫోన్ల్లో మాట్లాడారు. రోగులకు అన్నీ సదుపాయాలు కల్పించాలని కోరారు. వైద్యులు విధులకు గైర్హాజరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో.. సీఎం సహాయనిధి నుంచి 56 మందికి మంజూరైన రూ. 22.60 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిస ఎమ్మెల్యే - ఉదయగిరి ఆసుపత్రిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ
ఆసుపత్రిలో వసతులు ఎలా ఉన్నాయి..? వైద్యులు సమయానికి ఆసుపత్రికి వస్తున్నారా..? మందులు సరైన సమయంలో అందుతున్నాయా? తదితర విషయాలను తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సామాజిక ఆరోగ్య కేంద్రంలో.. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ