కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయటంపై అక్కడి సిబ్బందికి ఇబ్బందులు తప్పాయి. సాధారణంగా పోలీస్ క్యాంటీన్ జిల్లా కేంద్రంలో ఒక్క చోటే ఉంటుంది. పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తమకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దాదాపు 100 కిలోమీటర్లు దూరం ప్రయాణించి, సరుకులు తెచ్చుకోవటం సిబ్బందికి ఇబ్బందులుండేవి. కర్నూలు ఎస్పీ ఫకీరప్ప చొరవ తీసుకుని సబ్ డివిజన్ స్థాయిలో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇలా జిల్లాలో 6 సబ్ డివిజన్లో నెలలో ఒక రోజు చొప్పున ఈ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు జిల్లా కేంద్రం నుంచి వాహనాల్లో సరుకులు తీసుకు వచ్చి పోలీస్ సిబ్బందికి అందుబాటులో ఉంచుతున్నారు. దీని వల్ల ఒక్కో పోలీస్‌కు నెలకు 5 వందల రూపాయల వరకూ లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: గుడిలోనే బడి.. భక్తుల మధ్యలోనే చదువు