రైతు బాగుండటమే ముఖ్యమంత్రి జగన్ ఆశయమని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి నిజమైన అభివృద్ధి అదేనని వ్యాఖ్యానించారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రస్తుతం ఉన్న సమస్యకు కారణమని అభిప్రాయపడ్డారు. తొలిసారిగా సాగు చేసిన నెల్లూరు-3354 రకం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. పంట బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
'అందుకే కేంద్ర ప్రభుత్వ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపాం'
రైతు బాగుండటమే నిజమైన అభివృద్ధి అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వ్యాఖ్యానించారు. తొలిసారిగా సాగు చేసిన నెల్లూరు-3354 రకం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. రైతులకు మంచి చేసే కేంద్ర ప్రభుత్వ బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలిపామని మేకపాటి పేర్కొన్నారు.
మేకపాటి గౌతం రెడ్డి
నెల్లూరు జిల్లా రైతులకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధైర్యం చెప్పారు. రైతులకు మంచి చేసే కేంద్ర ప్రభుత్వ బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలిపామని మేకపాటి పేర్కొన్నారు. భవిష్యత్లో ఇకపై మద్దతు ధర సమస్య రాకుండా చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో రైతులను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తి విగ్రహాల కేసును ఛేదించిన పోలీసులు...ముగ్గురు అరెస్ట్