రాష్ట్రానికి నీటివసతులను కల్పించడానికి ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పోతిరెడ్డిపాడు ద్వారా అదనపు వరద నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను కొనసాగిస్తుందని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి 7వేల కోట్లు మొదటి దశలో ఖర్చు చేయనున్నామని తెలిపారు.
'తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు' - గోదావరి నీటి వార్తలు
సముద్రంలోకి నీరు పోకుండా ప్రతి చుక్కను ఒడిసిపడట్టేదిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల శ్రేయస్సుకొరకై అన్నాదమ్ముల్లాగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు.
'తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు'
కృష్ణావరద సముద్రంలోకి పోతుందని... దానిని ఒడిసిపట్టి నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలు కలసి చేస్తున్న అభివృద్ధిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టొద్దని..రాష్ట్రాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని కోరారు. గోదావరి జలాలపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నారని అన్నారు.