నెల్లూరు నగరానికి పెన్నానదిపై రెండో వంతెన మంజూరైందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Minister Anil Kumar) ప్రకటించారు. వంతెనకు సంబంధించిన టెండర్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ(Talpagiri Ranganathaswamy Temple) పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆలయ కమిటీ ఛైర్మన్గా శివాచారి, మరో ఎనిమిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Minister Anil Kumar: 'పెన్నా వంతెన టెండర్లను త్వరలోనే పూర్తి చేస్తాం'
నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ(Talpagiri Ranganathaswamy Temple) పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అనిల్ కుమార్(Minister Anil Kumar) హాజరయ్యారు. ఆలయాన్ని రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరానికి రెండో పెన్నా వంతెన మంజూరైందని.. త్వరలోనే టెండర్లను పూర్తి చేస్తామన్నారు.
Minister Anil Kumar
తల్పగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.వంద కోట్లతో జాఫర్ సాహెబ్ కాలువ పనులకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారని అన్నారు. నగరంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:tragedy : పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం