ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండిపాలెంలో 'మనం - మన పరిశుభ్రత' ప్రారంభం

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామ పంచాయతీలో 'మనం - మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. పంచాయతీని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.

nellore  district
గండిపాలెంలో మనం మన పరిశుభ్రత ప్రారంభం

By

Published : Jun 1, 2020, 5:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పైలట్​గా ఎంపిక చేసిన ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామ పంచాయతీలో 'మనం - మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని కావలి డివిజనల్ పంచాయతీ అధికారి రమేష్ ప్రారంభించారు. పంచాయతీని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. పంచాయతీలో నియమించిన గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు ఇళ్ల వద్దకు వచ్చి తడి, పొడి చెత్తను సేకరిస్తారన్నారు. అలా సేకరించిన చెత్తను గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన 'చెత్త నుంచి సంపద తయారీ' కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తారని తెలిపారు. తయారుచేసిన ఎరువును గ్రామంలోని రైతులకు విక్రయిస్తారు అన్నారు.

ఇళ్ల వద్దకు వచ్చి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్ల వేతనం కోసం ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 60 వంతున వసూలు చేస్తామన్నారు. గ్రామ ప్రజలంతా సహకరించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. గ్రీన్ అంబాసిడర్ లకు సమ దుస్తులు అందజేయడంతో పాటు మండల స్థాయి అధికారులతో కలసి గ్రామంలో ర్యాలీగా వెళ్లి చెత్త సేకరణ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరాస్వామి, పంచాయతీ ప్రత్యేక అధికారి రామారావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పాముల రమణయ్య, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అమర్​నాథ్​రెడ్డి పాల్గొన్నారు.

ఇది చదవండిపేద కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ చేయూత

ABOUT THE AUTHOR

...view details