గత రబీ సీజన్లో కండలేరు జలాశయం కింద రైతులకు 3 లక్షల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించామని కండలేరు జలాశయం ఎస్ఈ హరి నారాయణ రెడ్డి తెలిపారు. రెండో పంటకు కండలేరు జలాశయం నుంచి నీరు ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం జలాశయంలో 26 టీఎంసీలు ఉన్నాయని చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు అందిస్తున్నట్లు తెలిపారు. పాడి పశువుల తాగునీటికి, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామని ఈ కారణాల వల్ల రెండో పంటకు నీరు ఇవ్వలేకపోతున్నామని వెల్లడించారు.
'రెండో పంటకు కండలేరు జలాశయం నుంచి నీరు ఇవ్వలేం' - కండలేరు జలాశయం వార్తలు
రెండో పంటకు కండలేరు జలాశయం నుంచి నీరు ఇవ్వలేమని ప్రాజెక్టు ఎస్ఈ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పాడి పశువుల తాగునీటికి, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామని.. ఈ కారణాల వల్ల రెండో పంటకు నీరు అందించలేమని వివరించారు.
kandaleru Reservoir in nellore