తోలుబొమ్మలాట కళాకారులను హిందూ దేవాలయ పరిరక్షణ సేవాసమితి అధ్యక్షుడు కమలానంద భారతి పలకరించారు. వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని తోలుబొమ్మలాట కేంద్రంలో కళాకారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ప్రాచీన తోలుబొమ్మలాట కళకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ ఉత్సవాల్లో తోలుబొమ్మలాటలు నిర్వహించి... కళాకారులకు ఆర్థికంగా సహాయపడాలని కోరారు. తోలుబొమ్మలాట కళ అంతరించిపోకుండా కళాకారులకు ప్రోత్సాహం అందించాలన్నారు.
'తోలుబొమ్మలాట కళను ప్రోత్సహించండి' - నెల్లూరు జిల్లా డి.సి. పల్లిలో కమలానంద భారతి పర్యటన
ప్రాచీన తోలుబొమ్మలాట కళ అంతరించిపోకుండా చూడాలని... హిందూ దేవాలయ పరిరక్షణ సేవాసమితి అధ్యక్షుడు కమలానంద భారతి ప్రభుత్వాన్ని కోరారు. కళాకారులకు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా డి.సి.పల్లిలో ఆయన పర్యటించారు. గ్రామంలోని తోలుబొమ్మలాట కళాకారులను కలిశారు.
తోలుబొమ్మలాట కళాకారులను పరామర్శిస్తున్న కమలానంగ భారతి, తదితరులు