ETV Bharat / state

'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది' - ex minister somireddy attend round table meeting in nellore

ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి​ విమర్శించారు. అమరావతి పరిరక్షణ కోసం నెల్లూరులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'
'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'
author img

By

Published : Dec 28, 2019, 12:01 AM IST

'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'

అమరావతి పరిరక్షణ కోసం నెల్లూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెదేపా, కాంగ్రెస్​, వామపక్ష పార్టీలతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తెదేపా నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తామంటూ మాజీ మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి తన చేతకాని పాలనతో రాష్ట్రాన్ని స్తంభింపజేశారంటూ దుయ్యబట్టారు. రాజధాని అంశంపై వేసిన జీఎన్​రావు కమిటీ అర్థం లేని రిపోర్ట్​ ఇస్తే... దానిని వైకాపా నాయకులు ముందుగానే ప్రకటించడం ఏమిటంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి :

'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం'

Intro:Ap_Nlr_02_27_Amaravathi_Akhilapaksham_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలౌతోందని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ అర్థం లేని రిపోర్ట్ ఇస్తే, దానిని నాయకులు ముందుగానే ప్రకటించడం ఏమిటనే ఆయన ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణకోసం నెల్లూరులోని ఐ.ఎం.ఎ. హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు విద్యార్థి, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. తెదేపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ తమ చేతకాని పాలనతో రాష్ట్రాన్ని స్తంభింపజేశారని ఈ సందర్భంగా సోమిరెడ్డి దుయ్యబట్టారు. అమరావతి పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తామని ప్రకటించారు.
బైట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, తెదేపా నేత.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.