ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి

By

Published : Apr 20, 2020, 7:06 PM IST

కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించాయి. మద్యం షాపులు కూడా నిలిపివేయటంతో కొంతమంది అదునుగా తీసుకొని నాటుసారా తయారీకి సిద్ధమయ్యారు.

Excise officers' raid on Natusara settlements
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమనలో పంట పొలాల్లో నాటు సారా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడిచేశారు. ఈ దాడిలో మూడు డ్రమ్ముల నాటుసారా, 600 కేజీల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వారి రాకను గమనించిన నిందితులు అక్కడినుంచి పారిపోయారు. వారికోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బుచ్చి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ ఆర్డినెన్స్‌పై విచారణ ఈనెల 28కి వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details