రాష్ట్రంలోనే తొలిసారిగా నెల్లూరు కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. తక్కువ ధరకే నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్ - నెల్లూరు కార్పొరేషన్
నెల్లూరు కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దీని ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలు ఇస్తామని ప్రకటించారు.
పారిశుద్ధ్య కార్మికులు
అక్షయపాత్ర ఫౌండేషన్ నెల్లూరులోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ ఒకే విధమైన డ్రస్ కోడ్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.