ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుక బస్తాలతో నీటి వృథాకు అడ్డుకట్ట

By

Published : Nov 4, 2020, 3:33 PM IST

సోమశిల జలాశయం నుంచి నీరు వృథాగా పోకుండా ఉండేందుకు సంగం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.

sand bags at somashila reservoir
ఇసుక బస్తాల ఏర్పాటు

సోమశిల జలాశయం నుంచి విడుదల చేసిన నీరు.. వృథాగా సముద్రంలో కలవకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సంగం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు కిందకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగనున్న ఐఏబీ సమావేశం అనంతరం సోమశిల నుంచి సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేయనున్నారు. కావలి కాలువ ద్వారా విడుదలకు ఏర్పాటు చేస్తుండగా.. ఇరిగేషన్ అధికారులు పనులను పరిశీలించారు.

ఇదీ చదవండి:నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె

ABOUT THE AUTHOR

...view details