కొవిషీల్డ్ వ్యాక్సిన్ నెల్లూరు జిల్లాకు చేరింది. మొదటి విడతగా 38,500డోసులు వచ్చాయి. ఈ నెల 16వ తేది నుంచి 26కేంద్రాల ద్వారా రోజుకు ప్రతి కేంద్రంలో 100మందికి వ్యాక్సిన్ ఇస్తామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన 28రోజులు తరువాత రెండో డోస్ ఇస్తామన్నారు. మొత్తం 42రోజులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలని అధికారులు తెలిపారు. 14రోజులు తరువాత యాంటీబాడీస్ అభివృద్ధి అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాకు తొలి విడతలో 38,500 డోసులు - కొవిషీల్డ్ వ్యాక్సిన్ తాజా సమాచారం
నెల్లూరు జిల్లాకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో కొవిడ్ వారియర్స్‌కి ఇస్తామన్నారు. 26 కేంద్రాల ద్వారా టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు తొలి విడతలో 38,500 డోసులు
మొదటి విడతలో కొవిడ్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీస్, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖల సిబ్బందికి ఇస్తారు. వరుస క్రమంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి