ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అరెస్టు - childrens

పిల్లలను అపహరించే ముఠాను నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి చెరనుంచి నలుగురు పిల్లలను విడిపించారు.

కిడ్నాప్ ముఠా అరెస్టు

By

Published : Sep 4, 2019, 11:35 PM IST

పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అరెస్టు

నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. వారి చెరనుంచి నలుగురు పిల్లలకు విముక్తి కలిగించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆలయాల వద్ద ఒంటరిగా ఉండే పిల్లలను అపహరించి, బాల కార్మికులుగా మారుస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చెందిన శంకరయ్య, సురేష్, వెంకయ్యలకు కిడ్నాపులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. బాతులను మేపుకుంటూ సంచార జీవనం సాగిస్తున్న వీరు గత కొంతకాలంగా పిల్లలను అపహరిస్తూ, వారిని బాతులు మేపే పనికి వినియోగిస్తున్నారు. పది రోజుల క్రితం కరుణాకర్, మగధీర అనే పిల్లలు వీరి వద్ద నుంచి పారిపోయి తమ సొంత గ్రామాలకు చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి, వీరి చెరలో ఉన్న శివసాయి, రామయ్య అనే పిల్లలకు విముక్తి కలిగించారు. శివ సాయి అనే నాలుగేళ్ల బాలుడి తల్లితండ్రుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details