నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలోని ఓ వివాహానికి హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం వచ్చింది. పెళ్లి అనంతరం వారు స్వగ్రామానికి వెళ్లిపోయారు. వారు ప్రభుత్వ పాఠశాలలో హెలికాప్టర్ ను దింపడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై అధికారుల ఆదేశాలతో ఆత్మకూరు ఆర్డీఓ, పోలీసులు విచారణ చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా హై స్కూల్ మైదానంలో ల్యాండ్ చేయడంపై... హెలికాప్టర్ యాజమాన్యం, ప్రధానోధ్యాయుడు, హెలికాప్టర్లో వచ్చిన ఆరుగురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్... కేసు నమోదు - nellore district latest news
అనుమతి లేకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అవటంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రేవూరులో జరిగింది.

పాఠశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్... కేసు నమోదు